మెగా రీమిక్స్‌ బాటలో అల్లు అర్జున్‌?

మరిన్ని వార్తలు

త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం ఓ సాంగ్‌ రీమిక్స్‌ చేద్దామనుకుంటున్నారట. మెగాస్టార్‌ సూపర్‌ హిట్‌ సినిమాలోని సూపర్‌ పాపులర్‌ సాంగ్‌ అనీ తెలుస్తోంది. అయితే పూర్తి సాంగ్‌ని రీమిక్స్‌ చేయరట. ఓ సాంగ్‌లో చిన్న బిట్‌ మాత్రమే రీమిక్స్‌ చేద్దామని అనుకుంటున్నారట. ఈ సాంగ్‌ రీమిక్స్‌ ఆలోచన పూర్తిగా త్రివిక్రమ్‌దే అని తెలుస్తోంది.

 

తొలుత సాంగ్‌ మొత్తం రీమిక్స్‌ చేద్దామనుకున్నారట. కానీ, అల్లు అర్జున్‌ సూచన మేరకు చిన్న బిట్‌ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారట. తమన్‌ ఈ సాంగ్‌కి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఈ సాంగ్‌ ఉండబోతోందట. సిట్యువేషనల్‌గా సాగే ఈ సాంగ్‌లో ఈ బిట్‌ చాలా ఎనర్జిటిక్‌గా కంపోజ్‌ చేస్తున్నారట. మామూలుగా త్రివిక్రమ్‌ సినిమాలో సాంగ్స్‌ అన్నీ కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌లోనే ఉంటాయి.

 

అయితే ఈ సాంగ్‌ మాత్రం సిట్యువేషన్‌గా సాగుతూ, మధ్యలో చిన్న బిట్‌ మాత్రం చాలా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందట. ఆ బిట్‌కే అల్లు అర్జున్‌ స్టెప్స్‌ ఇరగదీసేస్తాడట. 'అలకనంద' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్ధే హీరోయిన్‌గా, టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్ర కోసం నివేదా థామస్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS