మెగా కొడుకు కోసం చిరు...

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఇక కాకతాళీయంగా ఆయన తాజా చిత్రం రంగస్థలం ఈ వారంలోనే విడుదలకానుండడంతో ఈ మెగా హీరోకి ఈ పుట్టినరోజు ప్రత్యేకం కానుంది.

ఇక చరణ్ పుట్టినరోజు పురస్కరించుకుని చిరంజీవి-సురేఖలు నిన్న రాత్రి ఒక స్పెషల్ గిఫ్ట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఒక లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అని తెలుస్తున్నది.

 

ఇదిలావుండగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియచేప్పడమే గాక రామ్ చరణ్ రంగస్థలం కూడా సూపర్ హిట్ కావాలని అందరు ఆశిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మొత్తానికి మెగా పవర్ స్టార్ ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలిచిపోనుంది...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS