రెజినా బికినీ అందాల్ని చూస్తారా?

మరిన్ని వార్తలు

అందాల భామ రెజినా ఏమయిపోయింది? అని తెలుగు సినీ జనాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడీ బ్యూటీ తమిళ సినిమాలతో బిజీగా వుంది. 

ఇటీవలే బాలీవుడ్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది కూడా. ఈ మధ్యనే 'అ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినా, రెజినా ఎందుకో కొన్నాళ్ళుగా తెలుగులో వేగం బాగా తగ్గించేసింది. తమిళంలో తిరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న రెజినా, ఈ సినిమాతో తన కెరీర్‌ మళ్ళీ జోరందుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. సీనియర్‌ నటుడు కార్తీక్‌ తనయుడు గౌతమ్‌ కార్తీక్‌ సరసన రెజినా, తమిళంలో ఈ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా సాంగ్‌ షూట్‌ ఇటీవలే కంప్లీట్‌ చేసుకుంది. 

బీచ్‌లో రెజినా గ్లామర్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనట. రెజినా బికినీ గ్లామర్‌ని దర్శకుడు ఓ రేంజ్‌లో చూపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయినా రెజినాకి గ్లామర్‌ ఒలకబోయడం కొత్తేమీ కాదు. అల్ట్రా మోడ్రన్‌ గెటప్స్‌లో ఎన్నో సినిమాల్లో గ్లామర్‌ ఒలకబోసేసిన రెజినా, పద్ధతిగా చీరకట్టులోనూ హై ఓల్టేజ్‌ సెక్సప్పీల్‌ పండించేసింది. తెలుగులో రెండు మూడు సినిమాలు లైన్‌లో వున్నాయంటోంది ఈ బ్యూటీ. 

బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుండడం కొత్త అనుభూతినిస్తోందట రెజినాకి. సౌత్‌ అయినా, బాలీవుడ్‌ అయినా పెద్దగా తేడాలేమీ వుండవనీ, సౌత్‌లో సినిమాల నిర్మాణం వేగంగా జరుగుతుందనీ రెజినా అభిప్రాయపడింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS