మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో విడుదల కార్యక్రమంలో తన సినిమా కెరీర్ తొలినాళ్ళలో జరిగిన సంఘటనల గురించి ఒకసారి గుర్తుచేసుకుంటూ అందరితోనూ వాటిని పంచుకునే ప్రయత్నం చేశాడు.
ఇంతకి ఆయన ఏం చెప్పాడంటే- "నాకు 80వ దశకంలో సూపర్ హిట్ చిత్రాలు ఎక్కువ ఉన్నాయి అన్నా, ఎప్పటికి నిలిచిపోయే పాటలు ఉన్నాయి అన్నా, నవలా కథానాయకుడు అన్న పేరు వచ్చినా, ఇప్పుడు అందరు కీర్తిస్తున్న మెగాస్టార్ అనే టైటిల్ రావడానికి వెనుక కారణం ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే KS రామరావు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ అధినేతగా చాలా మంచి అభిరుచి గల చిత్రాలని నిర్మించే నిర్మాతగా ఆయనకి మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో..
అయితే మా కలయికలో ఒక ఫ్లాప్ చిత్రం వచ్చింది. ఒకరకంగా ఇది నా తప్పే అని అనిపిస్తుంటుంది. అయితే ఆ పరాజయానికి కారణం దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ అని ఆయనే స్వయంగా ఒప్పుకోవడం ఆ దర్శకుడి గొప్ప మనసుకి నిదర్శనం. కాని ఎక్కడో ఆ చిత్రం పరాజయానికి నాది పరోక్ష కారణం అని అనిపిస్తుంటుంది.
ఇక ఈరోజు ఈ ఈవెంట్ కి రావడానికి ముఖ్య కారణం ప్రాధాన కారణం నిర్మాత KS రామారావు అని అన్నది నూటికినూరు శాతం అని ముగించాడు".
దీనితో ఈ మాటలు విన్న KS రామారావు భావోద్వేగానికి గురికావడం కనిపించింది.