చిరంజీవి హీరోగా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తమిళ 'కత్తి'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆ సినిమాలోని కథకి పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా చిరంజీవిని చూపించడంలో వినాయక్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అయ్యారు. దీని తర్వాత చిరంజీవి చేసే సినిమా మార్చ్‌లో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సెట్స్ మీదికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. మరోసారి రామ్‌చరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి అంటే మాస్. సురేందర్ రెడ్డి క్లాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్. ఇంకేముంది మాస్ టచ్ ఉంటూనే స్టైలిష్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి రూపొందించబోతున్నాడట. అలాగే చిరంజీవితో మహా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా రూపొందించబోతున్నాడు. అది కూడా అతి త్వరలో లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలియవస్తోంది. దీన్ని అల్లు అరవింద్ నిర్మించే అవకాశం ఉంది. ఒకటి మాస్ టచ్‌తో ఉన్న క్లాస్ మూవీ, ఇంకోటి మహా మాస్ మూవీ. రీ ఎంట్రీతోనే రికార్డులు బద్దలుకొట్టిన చిరంజీవి ఇక రాబోయే సినిమాలతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో. దటీజ్ మెగాస్టార్ స్ట్రాటజీ.