మెగాస్టార్ రీ ఎంట్రీ వెనక పూర్తి ప్లానింగ్ చరణ్‌దే. మొదట్లో పూరి జగన్నాధ్‌తో చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అనుకున్నా తర్వాత వినాయక్ లైన్‌లోకి వచ్చాడు. ఆ కాంబినేషన్‌ని ప్లాన్ చేసింది చరణే. చరణ్ ఆల్రెడీ వినాయక్‌తో వర్క్ చేశాడు. వినాయక్ - చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'నాయక్' సినిమా మంచి విజయం అందుకుంది. ఆ సినిమా టైంలోనే చిరంజీవి అంటే వినాయక్‌కి ఎంత ప్యాషనో చరణ్‌కి తెలుసుకున్నాడు చరణ్. అలా 'ఖైదీ నెం 150' వినాయక్‌తో పట్టాలెక్కడం అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత చరణ్, సురేందర్‌రెడ్డితో ధృవ' చేయడం, ఆ టైంలోనే సురేందర్‌రెడ్డిని చిరంజీవి కోసం లైన్‌లో పెట్టడం చకచకా జరిగిపోయాయి. అలా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి' సినిమా పట్టాలెక్కింది. లేటెస్టుగా చిరంజీవి కోసం సుకుమార్‌ని దాదాపుగా లైన్‌లో పెట్టేశాడట చరణ్. క్లాస్ టచ్‌తో ఉన్న మాస్ సబ్జెక్ట్‌ని చిరంజీవి కోసం సుకుమార్ ఆల్రెడీ రెడీ చేసినట్లు సమాచారమ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట.
ఓ పక్క తన కెరీర్ ప్లానింగ్, మరో పక్క తండ్రి కెరీర్ ప్లానింగ్‌తో చరణ్ శభాష్ అనిపించుకుంటున్నాడు. కొడుకు కోసం తండ్రి కెరీర్ ప్లాన్ చేయడం కాదు. తండ్రి కోసం కొడుకు ప్లాన్ చేయడం అంటే అది అందరూ మెచ్చుకునే విషయమే. అందుకే చరణ్‌ని ఈ విషయంలో ఎంతటి వారైనా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఏ తండ్రికైనా ఇంతకన్నా పుత్రోత్సాహం ఇంకేముంటుంది. త్వరలోనే 'రంగస్థలం' సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.