'కౌసల్య'కు మెగాస్టార్‌ ఫుల్‌ సపోర్ట్‌!

By iQlikMovies - June 19, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

'కౌసల్యా కృష్ణమూర్తి'.. ఈ పేరును పెద్దగా పట్టించుకోలేదింతవరకూ. కానీ, ఈ సినిమా టీజర్‌ మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కాబోతోందనే వార్త బయటికొచ్చాక అందరి దృష్టీ సినిమాపై పడింది. అచ్చమైన మన తెలుగమ్మాయ్‌ ఐశ్వర్యా రాజేష్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ మూవీని తెలుగులో రీమేక్‌ చేశారు. తమిళంలో శివకార్తికేయన్‌ ఈ సినిమాకి నిర్మాత కాగా, ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు ఈ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక కథ విషయానికి వస్తే, క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది.

 

ఓ పల్లెటూరి అమ్మాయి.. క్రికెట్‌పై ఆశక్తితో ఇంటర్నేషనల్‌ స్థాయికి ఎలా ఎదిగింది.? ఆ మార్గంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటీ.? అనే కథనంతో రూపొందించారు ఈ సినిమాని. టీజర్‌ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఐశ్వర్యా రాజేష్‌ని అందరూ ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఈ మధ్య వచ్చిన 'మజిలీ', 'జెర్సీ'.. తదితర సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. కానీ, లేడీ ఓరియెంటెడ్‌ తరహాలో వస్తున్న 'కౌసల్యా కృష్ణమూర్తి' వంటి సినిమాలకు ఉండాల్సిన ఎంకరేజ్‌మెంట్‌ ఉంటే, భవిష్యత్తులో ఈ తరహా సినిమాలు మరిన్ని తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. టీజర్‌ చాలా బాగుందనీ, ఐశ్వర్యా రాజేష్‌ అద్భుతంగా నటించిందనీ చెబుతూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ ఈ సందర్భంగా చిరు అన్నారు. తమిళ వెర్షన్‌లో కీలక పాత్ర పోషించిన శివకార్తికేయన్‌ తెలుగులో కూడా గెస్ట్‌ అప్పీల్‌ ఇవ్వడం విశేషం. గతంలో ఈయన నటించిన 'రెమో' తెలుగులోకి అదే పేరుతో డబ్‌ అయ్యి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కీర్తిసురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS