ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించింది. దీంతో ఏపీలో చాలా థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ రెట్లతో నడపలేకపోతున్నామని థియేటర్లకి తాళం వేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో టికెట్ రేట్లు పెంచే కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
‘‘‘తెలుగు చిత్రపరిశ్రమ కోరికను మన్నించి.. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం, అన్ని వర్గాలవారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు''’’ అని ట్వీట్ చేశారు చిరు. ఏదేమైనా ఏపీ సర్కార్ నిర్ణయంతో టోటల్ గా చిత్ర పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్ధకమైన పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.