వాళ్లిద్ద‌రినీ క‌ల‌పాల‌ని చిరు ప్ర‌య‌త్నం

By Gowthami - March 11, 2020 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

దాదాపుగా మెగా హీరోలంద‌రితోనూ ప‌నిచేశాడు త్రివిక్ర‌మ్‌. అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కైతే హ్యాట్రిక్ సినిమాలు తీసిచ్చాడు. చిరంజీవి సినిమాకి రైట‌ర్‌గా (జై చిరంజీవ‌)గా వర్క్ చేశాడు. చిరంజీవి - త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని రెండేళ్ల క్రితం బాగా ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌ట్లో త్రివిక్ర‌మ్ కూడా ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు. అయితే.. చిరంజీవి మాత్రం చ‌ర‌ణ్ - త్రివిక్ర‌మ్ కాంబోని సెట్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ మంచి ఫామ్ లో ఉన్నాడు.

 

ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో`తో ఓ ఇండ్ర‌స్ట్రీ హిట్‌ని అందించాడు. త్రివిక్ర‌మ్ సినిమాల్లో న‌టిస్తే... హీరోల రేంజ్ పెరుగుతోంది. పైగా ఓ ఫ్రెష్ ఫీలింగూ, ఇమేజూ వ‌స్తోంది. అందుకే చ‌ర‌ణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. చిరంజీవితో ఓ సినిమా తీసే క‌మిట్‌మెంట్ త్రివిక్ర‌మ్‌కి ఉంది. ఆ స్థానంలో చ‌ర‌ణ్ - త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌న్న మాట‌. ఈ చిత్రానికి దాన‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS