హగ్‌ ఇస్తానన్న మోహన్‌బాబు, వద్దన్న చిరంజీవి.

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలోకి మెగాస్టార్‌ చిరంజీవి ఎంట్రీ ఓ ప్రభంజనంలానే కనిపిస్తోంది. ఎడా పెడా ట్వీట్లు దూసుకొస్తున్నాయి మెగాస్టార్‌ నుంచి. ఆ ట్వీట్లలో వీలైనంతవరకు ‘కరోనా వైరస్‌’ ప్రస్తావన వుండేలా చిరంజీవి చూసుకుంటుండడం గమనార్హం. తాజాగా, మోహన్‌బాబుకి రిప్లయ్‌ ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ‘మిత్రమా.. కరోనా రక్కఇ కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. హగ్గుల్లేవు. షేక్‌ హ్యాండ్స్‌ లేవు.. నమస్తే మాత్రమే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ తప్పదు. మనల్ని, మనవారిని మనం రక్షించుకోవాలి.. మంచు లక్ష్మి ప్రసన్న ఓ వీడియోలో చెప్పింది కదా..’ అన్నారు.

సోషల్‌ మీడియాలోకి తన మిత్రుడు చిరంజీవిని మోహన్‌బాబు వెల్‌కవ్‌ు చేయడంతో, ‘థ్యాంక్యూ మిత్రమా..’ అంటూనే, ‘రాననుకున్నావా, రాలేననుకున్నావా..’ అని చిరంజీవి తనదైన స్టయిల్లో సెన్సాఫ్‌ హ్యామర్‌ చాటుకున్నారు. దానికి సమాధానమిచ్చిన మోహన్‌బాబు, ‘ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు చెబుతా..’ అని ట్వీట్‌ చేశారు. ఈ ‘హగ్‌’ ట్వీట్‌ని చిరంజీవి, కరోనాపై అవేర్‌నెస్‌ క్రియేట్‌ చేయడానికి పై విధంగా వినియోగించారు. సెలబ్రిటీలు ఎంత ఎక్కువగా కరోనా వైరస్‌ పట్ల అవగాహన పెంచేలా ప్రయత్నిస్తే, అంత వేగంగా వారి అభిమానులకు ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’పై అవగాహన పెరుగుతుందన్నది నిర్వివాదాంశం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS