యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ విజువల్స్.. ఇందులో ఏది గొప్ప.? యంగ్ టైగర్ వాయిస్ గనుక లేకపోయి వుంటే, నిన్నటి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రోమో దారుణంగా ఫెయిలయ్యేదంటూ కొందరు దుష్ప్రచారానికి దిగారు. దానికి, రామ్‌చరణ్ అభిమానులు కొంత నొచ్చుకున్నా, హద్దులు దాటి కామెంట్లు పోస్ట్ చేయలేదు సోషల్ మీడియాలో. ‘నా అన్న సీతారామరాజు..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, చరణ్ కోసం ఇచ్చిన ఇంట్రో అదిరిపోయిన మాట వాస్తవం. అదే సమయంలో, చరణ్ తన కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శించిన తీరు, వీడియోలో చూపించిన బాడీ లాంగ్వేజ్.. న భూతో న భవిష్యతి! అయినా, చరణ్ - ఎన్టీఆర్ మధ్య సూపర్బ్ ఫ్రెండ్‌షిప్ కొనసాగుతున్న వేళ, ఇద్దరి మధ్యా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదెవరట? ఖచ్చితంగా వాళ్ళయితే యంగ్ టైగర్ అభిమానులు కారు. సో, వీళ్ళని హేటర్స్‌గానే చూడాలి. అదే విషయాన్ని ఇటు చరణ్ అభిమానులు, అటు ఎన్టీఆర్ అభిమానులూ చెబుతున్నారు.
‘తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటే..’ అని హీరోలంతా ముక్త కంఠంతో నినదిస్తున్న వేళ, పనీ పాటా లేని అభిమానులతోనే అసలు సమస్య వచ్చి పడుతోంది. హేటర్స్ గోల పక్కన పెడితే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీవ్‌ు నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా, రామ్‌చరణ్‌కి రాజమౌళి ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ మాత్రం అదిరిపోయింది.