మెగాస్టార్ 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చి, బాక్సాఫీస్ వసూళ్ల దుమ్ము లేపేశాడు. అనంతరం చిరంజీవి చేయబోయే సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఉండబోతోందని ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. అయితే కథ విషయంలోనే క్లారిటీ లేదు ఇంతవరకూ. కానీ ఇప్పుడు ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' బయోపిక్ అని తేలిపోయింది. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండగా, చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబంధించి, చరిత్ర మూలాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇదో చారిత్రక నేపధ్యం ఉన్న కథ కాబట్టి, ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట చిత్ర యూనిట్. అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్‌లో తెరకెక్కించనున్నారు. సురేందర్ రెడ్డి సినిమాలన్నీ టెక్నికల్‌గా చాలా బాగుంటాయి. అంతేకాదు ఇది చారిత్రక నేపధ్యం ఉన్న స్టోరీ కాబట్టి, అప్పటి పురాతన ఆయుధాలు డిజైన్ చేయడానికి, ఆనాటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేకించి ఓ స్పెషల్ టీమ్ రంగంలోకి దిగిందని కూడా తెలియ వస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లును దించాలని అనుకుంటున్నారట. ఇండియాలోనే ది బెస్ట్ టెక్నీషియన్స్‌ని ఈ సినిమా కోసం తీసుకురావాలనుకుంటున్నారట. హై అండ్ టెక్నికల్ వేల్యూస్‌తో చిరంజీవి కెరీర్ బెస్ట్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట.