తెలుగులో పాత కథలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లు మన పాత కథల్ని రీమేక్ చేయడానికి ఎగబడుతున్నారు. కాంచన చాలా కాలం తరవాత అక్కడ రీమేక్ అయ్యింది. ఇప్పుడు ఛత్రపతిని.. రీమేక్ చేస్తున్నారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ సినిమా `ఊసరవెల్లి` కూడా చేరింది. ఎన్టీఆర్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `ఊసరవెల్లి`. తమన్నా కథానాయిక.
ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్దగా ఆడలేదు గానీ, ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇప్పుడు ఈ కథని బాలీవుడ్ లోకి తీసుకెళ్తున్నారు. టిప్స్ సంస్థ `ఊసరవెల్లి` హక్కుల్ని కొనుగోలు చేసింది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించే అవకాశం ఉంది. మరి.. దర్శకత్వ బాధ్యత ఎవరికి అప్పగిస్తారో చూడాలి. 2021 ప్రధమార్థంలో ఈ సినిమాని పట్టాలెక్కిస్తారు.