మెగాస్టార్‌పై ఫైర్‌.. అభిమానుల అత్యుత్సాహమిది!

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేశావ్‌.. ఆఖరికి అఖిల్‌ అక్కినేనికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేశావ్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కుమారుడు అకిరానందన్‌కి ఎందుకు శుభాకాంక్షలు చెప్పడంలేదు.? అంటూ మెగా అభిమానుల్లో కొందరు తెగ ‘గుస్సా’ అయిపోయారు. అభిమానుల్లో చీలిక తెచ్చేందుకు కొందరు చేస్తున్న దుష్ప్రచారంలో భాగమంటూ మెగా అభిమానులు మొత్తుకుంటున్నా, ఆ మెగా అభిమానుల్లో ‘ఓవరాక్షన్‌గాళ్ళతో’ పెద్ద సమస్యే వచ్చి పడింది. తన తమ్ముడి కుమారుడికి చిరంజీవి శుభాకాంక్షలు చెప్పకుండా వుంటారా.? అన్న ఇంగితం సోకాల్డ్‌ అభిమానుల్లో కొరవడింది.

ఆ సంగతి పక్కన పెడితే, అకిరానందన్‌కి చిరంజీవి తనదైన స్టయిల్లో విషెస్‌ అందించారు అకిరా చిన్నప్పటి ఫొటోని పోస్ట్‌ చేస్తూ. ‘మనబిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ. ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు (6 అడుగుల 4 అంగుళాలు). అన్ని విషయాల్లో కూడా అందరినీ ఇలాగే మించిపోవాలి. విష్‌ యు ఎ ‘పవర్‌’ఫుల ఫ్యూచర్‌. హ్యాపీ బర్త్‌డే అకిరా.. అంటూ ట్వీటేశారు మెగాస్టార్‌ చిరంజీవి. మెగాస్టార్‌ చిరంజీవికి చిన్న పిల్లలంటే చాలా చాలా ఇష్టం. పిల్లలతో హాయిగా ఎంజాయ్‌ చేయడానికి అకేషన్స్‌ని తనంతట తానుగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంటారు చిరంజీవి. ఏ మాటకామాటే చెప్పాలి.. మెగా కాంపౌండ్‌ నుంచి ఒకర్ని మించి ఇంకొకరు.. అన్నట్టుగా వారసులు వెండితెరపై సత్తా చాటేస్తున్నారు. అకిరా మెగా ఎంట్రీ ఎప్పుడో ఏమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS