మనవరాలితో తాతయ్య చిరంజీవి ‘క్వారంటైన్‌’ మూమెంట్స్‌!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవికి చిన్న పిల్లలంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయం అందరికీ తెల్సిందే. చిన్న పిల్లలతో కలిసి తానూ చిన్న పిల్లాడిలా మారిపోతారాయన. చిన్న పిల్లలతో సరదాగా టైవ్‌ు పాస్‌ చేస్తోంటే తనకు సమయమే తెలియదంటారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ‘లాక్‌డౌన్‌’ పీరియడ్‌ని మెగాస్టార్‌ చిరంజీవి తన మనవరాలితో ఎంజాయ్‌ చేస్తున్నారు. నిన్ననే సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిరంజీవి పంచుకున్నారు అభిమానులతో. ఓ పాట విషయంలో తాను ముందుకీ వెనక్కీ అవ్వాల్సి వస్తోందనీ, ఆ పాట ఏంటో రేపు చెబుతాననీ ట్వీటేశారు మెగాస్టార్‌.

 

అభిమానులంతా ‘మగువా మగువా’ పాట గురించే చిరంజీవి చెబుతారేమోనని ఆశించారు. దానిక్కారణమూ లేకపోలేదు. ఈ మధ్యనే ‘బి ద రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌’లో భాగంగా తన తల్లికి పెసరట్టు స్వయంగా వేసిన చిరంజీవి, ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వాడింది ‘మగువా మగువా’ పాటనే. అయితే, చిరంజీవి అభిమానులకి పెద్ద షాకే ఇచ్చారు. ఈసారి తన సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో ‘మి..మి..మి’ అంటూ సాగే పాట గురించి చెప్పారు. తన మనవరాలికి బాగా ఇష్టమైన పాట అదేనంటూ ఓ క్యూట్‌ వీడియో షేర్‌ చేశారు.

 

చిరంజీవి ఒళ్ళో కూర్చున్న ఆ మనవరాలు, ‘మి..మి..’ పాట గురించి అడగడం, చిరంజీవి సరదాగా వారించే ప్రయత్నం చేయడం.. ఇదంతా బోల్డంత ఫన్‌ క్రియేట్‌ చేసింది. ఏదిఏమైనా మెగాస్టార్‌ చిరంజీవి క్వారంటైన్‌ టైవ్స్‌ుని మేగ్జిమవ్‌ు ఎంజాయ్‌ చేస్తున్నారు.. అభిమానులకీ బోల్డంత ఎంజాయ్‌మెంట్‌ పంచుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS