చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాత. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి `ఆచార్య` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ పేరుని నిర్మాతలు రిజిస్టర్ కూడా చేయించేశారు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ ఇదే అనుకోవొచ్చు. దేవాలయాలు, వాటి నేపథ్యంలో సాగే కథ ఇది.
ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఓ పాటని, కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించేశారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాది చివర్లో ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే 2021 వేసవిలోనే ఈ సినిమా బయటకు వస్తుంది.