హీరోయిన్‌ ఫిక్సయ్యాకే చిరు షూటింగ్‌ షురూ!

By Inkmantra - November 05, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి 152 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని ఓ సాంగ్‌తో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట. అది, చిరంజీవి విత్‌ హీరోయిన్‌ సాంగ్‌ అని తెలుస్తోంది. అంటే, సినిమాకి హీరోయిన్‌ ఫిక్సయ్యాకే షూటింగ్‌ షురూ చేయనున్నారన్నమాట. అయితే, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్‌ ఫిక్స్‌ కాలేదు. త్రిష, అనుష్క తదితర పేర్లతో పాటు, కొందరు బాలీవుడ్‌ భామల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ, ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. అతి త్వరలోనే హీరోయిన్‌ కన్‌ఫామ్‌ కానుందట. హీరోయిన్‌ ఫిక్స్‌ అవ్వగానే వారిద్దరిపై ఓ రొమాంటిక్‌ డ్యూయెట్‌ చిత్రీకరించనున్నారట.

 

రొమాంటిక్‌ డ్యూయెట్‌ అయినా, గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులు ఉండేలా కొరియోగ్రాఫర్లు చూస్తున్నారట. చిరంజీవి అంటే డాన్సులు.. డాన్సులు అంటే చిరంజీవి.. ఇటీవల వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం హిస్టారికల్‌ మూవీ కావడంతో, చిరంజీవి డాన్సులు చూసే అవకాశం రాలేదు అభిమానులకు. సో అది చాలా లోటుగా ఫీలవుతున్నారు. కానీ, కొరటాల సినిమా అంటే పక్కా కమర్షియల్‌. సో ఖచ్చితగా పాటలు, డాన్సులు.. ఉండి తీరాల్సిందే. అందులోనూ అక్కడున్నది చిరంజీవి. ఇప్పటికే ఫిజికల్‌గా చిరంజీవి కత్తిలాంటి మేకోవర్‌తో పిచ్చ లేపేస్తున్నారు. డిశంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ చేయనున్నారనేది తాజా సమాచారం.

 

ఇదిలా ఉంటే, బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి, లేటెస్ట్‌గా స్టేజ్‌పై చేసిన సందడిని ఆడియన్స్‌ ఇంకా మర్చిపోలేదు. రొమాంటిక్‌ లుక్స్‌, సెన్సాఫ్‌ హ్యూమర్‌ డైలాగ్స్‌, తనదైన శైలి కటింగ్స్‌తో పిచ్చెక్కించేశారు. ఇక సినిమాలో ఇంకెంత చేస్తారో.. అంటూ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మొదలైపోయింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS