బిగ్‌బాస్‌ వీరికి బాగానే వర్కవుట్‌ అయ్యిందిగా.!

By Inkmantra - November 05, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చాకా, పాపులారిటీ రావడం మాటెలా ఉన్నా, ఉన్న కాస్తో కూస్తో క్రేజ్‌ కూడా పోగొట్టుకోవాలి.. అనే రూమర్‌ ఉందిన్నాళ్లూ. కానీ, ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 3, ఆడియన్స్‌ని ఎంజాయ్‌ చేయడంలో ఏమంత పీకలేకపోయినా, హౌస్‌ నుండి బయటికి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్‌కి కాసుల పంట పండించేలా కనిపిస్తోందట. ముఖ్యంగా హీరోయిన్స్‌ అయిన వితిక, పునర్నవిలకు బయటికొచ్చాక అవకాశాలు బాగా వస్తున్నాయట.

 

ఒకప్పుడు హీరోయిన్‌గా నటించింది వితిక. కానీ, చెప్పుకోదగ్గ సినిమాలు కావవి. దాంతో పెద్దగా వితిక షెరూ పేరు పాపులర్‌ కాలేదు. కానీ, ఇప్పుడలా కాదు, బిగ్‌బాస్‌లో వరుణ్‌కి భార్యగా, ఫ్యాషన్‌ క్వీన్‌గా వితిక షెరూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి టాప్‌ 5లో నిలవదగ్గ క్రెడిట్‌ ఉంది వితికకు. అయినా బ్యాడ్‌లక్‌.. 90 డేస్‌కి బయటికొచ్చేసింది. అయితేనేం, బయటికొచ్చాక భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటోందట.

 

అలాగే, పునర్నవి భూపాళం.. 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో సునీతగా కొంచెం అమాయకంగా, కొంచెం గడుసుతనంతో కనిపించిన ఈ పాప బిగ్‌బాస్‌లో విశ్వరూపం చూపించింది. తన ఆటిట్యూడ్‌తో విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించింది. హౌస్‌లోకి వెళ్లక ముందే, పునర్నవి ఖాతాలో మూడు సినిమాలున్నాయి. ఆ సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కూడా. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు పునర్నవికి క్యూ కడుతున్నాయట. సో బిగ్‌బాస్‌ గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వితిక, పునర్నవిలు బిగ్‌బాస్‌ అనంతరం బాగానే క్యాష్‌ చేసుకుంటున్నారనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS