చిరు సినిమా ప‌ట్టాలెక్కేది ఎప్పుడంటే..?

By Gowthami - December 17, 2019 - 09:05 AM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి - కొర‌టాల శివ కల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మ‌ణిశ‌ర్మ ఇటీవ‌లే బ్యాంకాక్‌లో మ్యూజిక్ సిట్టింగ్ ముగించుకుని వ‌చ్చారు. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈనెల 25 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ మొద‌లుకానున్న‌ద‌ని స‌మాచారం. సంక్రాంతి వ‌ర‌కూ ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. పండ‌క్కి కాస్త విరామం తీసుకుని, జ‌న‌వ‌రి చివ‌రి వారంలో మ‌రో షెడ్యూల్ మొద‌లెడ‌తారు.

 

ఈ చిత్రంలో క‌థానాయిక‌గా త్రిష పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే అధికారికంగా ఇంకా ఏం తెలీలేదు. రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ పాత్ర పోషిస్తాడ‌ని చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ ఈ విష‌య‌మై చిత్ర‌బృందం మౌనంగా ఉంది. కొర‌టాల శివ సినిమాల‌న్నీ ఏదో ఓ సామాజిక నేప‌థ్యం చుట్టూ అల్లుకుంటాయి. ఈసారి దేవాల‌యాలు, వాటిని కాపాడాల్సిన బాధ్య‌త‌.. వీటి పై క‌థానాయ‌కుడు సాగించే పోరాటంగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS