శంక‌ర్ చేతుల‌మీదుగా అవార్డు అందుకున్న చ‌ర‌ణ్‌.

మరిన్ని వార్తలు

అవార్డులు అందుకోవ‌డం మెగా హీరోల‌కు కొత్తేం కాదు. రామ్‌చ‌ర‌ణ్ ఖాతాలోనూ కొన్ని అవార్డులున్నాయి. `రంగ‌స్థ‌లం`తో ఆ జాబితా ఇంకా పెరుగుతోంది. తాజాగా చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో అవార్డు చేరింది. బిహైండ్ వుడ్ అనే సంస్థ ఇటీవ‌ల చ‌ర‌ణ్‌కి ఓ అవార్డుతో స‌త్క‌రించింది. పీపుల్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫ‌ర్ ఎక్స‌లెన్స్ అవార్డుతో చ‌ర‌ణ్‌ని గౌర‌వించింది. ఈ అవార్డుని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ చేతుల మీదుగా అందుకున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌.

 

ఇటీవ‌ల ఈ అవార్డు కార్య‌క్ర‌మం చెన్నైలో జ‌రిగింది. సౌత్ ఇండియాకు చెందిన చాలా మంది ఫిల్మ్ స్టార్లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్‌. మ‌రోవైపు చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లూ చూసుకుంటున్నాడు. ఈనెల‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS