ఇటీవల చిరంజీవి `గుండు` లుక్ ని విడుదల చేయడం, అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం, ఆ లుక్ గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకోవడం తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ గుండు లుక్ కి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు చిరంజీవి. ”ఆ వీడియోకు మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్. ప్రతి ఒక్కరు నమ్మేలా లుక్‌ని మేకోవర్ చేసే ఇండస్ట్రీలోని ప్రతి టెక్నీషియన్‌కి థ్యాంక్స్.
సినిమా మ్యాజిక్‌కి సెల్యూట్” అంటూ కామెంట్ పెట్టారు. అయితే ఈ లుక్ దేని కోసమన్నది బయటపెట్టలేదు. చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ కొరటాల దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం కానుంది. దాంతో పాటు లూసీఫర్, వేదాళం రీమేక్‌లకు చిరు ఓకే చెప్పారు. ఈరెండు సినిమాల్లో ఒకదానికోసమే ఈ గుండు లుక్ అని ప్రచారం జరుగుతోంది.