ఫ్యాన్స్‌ని క‌న్‌ఫ్యూజ్‌లో ప‌డేసిన మెగాస్టార్‌

మరిన్ని వార్తలు

`ఆచార్య‌` గురించి మాట్లాడుకున్న‌ప్పుడ‌ల్లా...ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తాడ‌నే అనుకున్నారు మెగా ఫ్యాన్స్‌. ఈ పాత్ర కోసం ముందుగా రామ్ చ‌ర‌ణ్ నే అనుకున్నా, ఒకానొక ద‌శ‌లో మ‌హేష్ బాబు పేరు కూడా ప‌రిశీల‌న‌కు వ‌చ్చింద‌ని, అత‌నికి 30 కోట్ల పారితోషికం ఇవ్వ‌డానికి సైతం చిత్ర‌బృందం అంగీక‌రించింద‌ని టాక్ న‌డిచింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణే చేస్తున్నాడ‌న్న క్లారిటీ వ‌చ్చింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ చిరంజీవి మాట‌లు క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేశాయి.

 

ఓ దిన ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన చిరంజీవి ఆచార్య గురించి మాట్లాడాడు. ఈ సినిమాలో మ‌హేష్ బాబు న‌టిస్తున్నాడంటూ వ‌చ్చిన వార్త‌ల్ని ఖండించాడు. అస‌లు ఆ వార్త‌లెలా వ‌చ్చాయో త‌న‌కు తెలీద‌ని అయోమ‌యానికి గురి చేశాడు. రామ్ చ‌ర‌ణ్ ఓ పాత్ర చేస్తే బాగుంటుంద‌ని, అయితే... త‌ను చేస్తాడా, లేదా అనేది ఇప్పుడే చెప్ప‌లేన‌ని, అదంతా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` పై ఆధార‌ప‌డి ఉంద‌ని, రాజ‌మౌళి చ‌ర‌ణ్‌కి కావ‌ల్సిన డేట్లు స‌ర్దుబాటు చేయ‌గ‌లిగితే.. త‌ప్ప‌కుండా ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తాడ‌ని, లేని ప‌క్షంలో తానేమీ చెప్ప‌లేన‌ని చెప్పుకొచ్చాడు చిరు. అంటే ఈ సినిమాలో చ‌ర‌ణ్ న‌టిస్తాడా, లేదా అనే విష‌యంలో ఇంకా చిత్ర‌బృందానికే క్లారిటీ రాలేద‌న్న‌మాట‌. తాజాగా చిరు చెప్పిన మాట‌లు వింటే ఆచార్య‌పై మ‌రింత క‌న్‌ఫ్యూజ‌న్ పెర‌గ‌డం ఖాయం. మ‌రి ఈ విష‌యంలో ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS