మలయాళంలో విజయవంతమైన చిత్రం `లూసీఫర్`. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా సుజిత్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు. ఇప్పుడు వినాయక్ చేతికి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు చిరు కాంపౌండ్ నుంచి ఎలాంటి సంకేతాలూ రాలేదు. ఓ దశలో లూసీఫర్ రీమేక్ ని పక్కన పెట్టారని ప్రచారం కూడా జరిగింది. దీనిపై ఎలాంటి స్పందనా లేదు.
అయితే `లూసీఫర్` కి ముహూర్తం కుదిరిందని టాక్. ఈ దసరాకి లూసీఫర్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. `ఆచార్య` పూర్తయిన వెంటనే ఈ రీమేక్ ని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది,. ఈ చిత్రంలో సుహాసిని ఓ కీలకమైన పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? సుహాసిని పాత్ర ఉందా, లేదా? అనే విషయాలు దసరాకి తేలనున్నాయి.