'చిత్ర‌ల‌హ‌రి' మూడు రోజుల కలెక్షన్స్..

By iQlikMovies - April 15, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ తెర‌కెక్కించింది. టాక్ కాస్త అటూ ఇటుగా ఉన్నా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం 'చిత్ర‌ల‌హ‌రి' ఆక‌ట్టుకుంది. తొలి రోజు రూ.3 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో మ‌రో 4.75 కోట్లు సాధించి బ‌య్య‌ర్లు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మొత్తానికి మూడు రోజుల్లోనూ 7.75 కోట్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి దాదాపు 10 కోట్ల బిజినెస్ జ‌రిగింది. బ‌య్య‌ర్లు త‌మ పెట్టుబ‌డిని తిరిగిరాబ‌ట్టుకోవాలంటే... వీక్ డేస్‌లో కూడా 'చిత్ర‌ల‌హ‌రి' నిల‌బ‌డాలి.

శుక్ర‌వారం వ‌ర‌కూ క‌నీసం 50 శాతం రెవిన్యూతో 'చిత్ర‌ల‌హ‌రి' సాగినా... బ‌య్య‌ర్లు సేఫ్ జోన్‌లో ప‌డిపోయిన‌ట్టే. నైజాంలో 3.15 కోట్ల‌కు ఈ సినిమా కొన్నారు. ఇప్ప‌టికి 2.53 కోట్లు వ‌చ్చాయి. సీడెడ్‌లో 1.70 కోట్ల‌కు కొంటే ఇప్ప‌టి వ‌ర‌కూ 1.30 కోట్లు వ‌చ్చాయి. ఇలా దాదాపు అన్ని ఏరియాల్లోనూ 60 నుంచి 70 శాతం రిక‌వ‌రీ అయిపోయాయి. ఆ మిగిలిన మొత్తం ఎన్ని రోజుల్లో వ‌స్తుంద‌న్న దాన్ని బ‌ట్టి బ‌య్య‌ర్లు సేఫా? కాదా? అనేది తేలిపోతుంది.

వ‌చ్చే వారం 'జెర్సీ', 'కాంచ‌న 3' విడుద‌ల అవుతున్నాయి. ఈలోగా వీలైన‌న్ని వ‌సూళ్లు తెచ్చుకుని, ఈ సినిమాని గ‌ట్టెక్కించాల్సిన బాధ్య‌త నిర్మాత‌ల‌పైనే ఉంది. అందుకే... వాళ్లు కూడా ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS