సీనియర్ నటుడు త్రిపురనేని చిట్టిబాబు సినీ ఇండస్ట్రీలో పలు అంశాలపై తనదైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. తాజాగా మోహన్ బాబు కుటుంబ వివాదం గురించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మోహన్ బాబు, విష్ణులపై దాడి చేయడానికి మనోజ్ తాండూరు నుంచి రౌడీలను తెప్పించాడని ఆరోపించారు.
అంతేకాదు.. మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడని, తండ్రిని కొట్టడానికి తాండూరు నుంచి రౌడీలను తెప్పించాడని, దారి తప్పిన మనోజ్ ను ఓ తండ్రిగా సన్మార్గంలో పెట్టాలనుకోలని మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని, మనోజ్ మాత్రం రౌడీలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని కూడా సమర్ధించేలా మాట్లాడారు చిట్టిబాబు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని, ఎదో అలజడిలో అలా జరిందని చెప్పుకొచ్చారు.
ఈ రోజుఉదయం విష్ణు మాట్లాడుతూ ఇది మా కుటుంబ సమస్య ఎవరూ తలదూర్చవద్దని కోరారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా విష్ణు మాట్లాడిన చోటి నుంచి ప్రెస్ మీట్ పెట్టి మరీ తండ్రిని కొట్టడానికి మనోజ్ తాండూరు నుంచి రౌడీలను తెప్పించాడని చిట్టిబాబు ఆరోపించడం వింతగా వుంది. కుటుంబం మధ్య మూడో మూడో మనిషి అవసరం లేదని చెప్పిన విష్ణు.. చిట్టి బాబు వాఖ్యలని, ఆరోపణలు ఎలా చూస్తారో మరి.
మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడు: చిట్టి బాబు
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2024
తాండూరు నుంచి రౌడీలను తెప్పిస్తాడా..?
తండ్రి, అన్నపై దౌర్జాన్యం చేస్తాడా..?
ఏ మోహన్ బాబుకి, విష్ణులకు రౌడీలు లేరా..? తెప్పించలేరా..?
దారి తప్పిన మనోజ్ ను ఓ తండ్రిగా సన్మార్గంలో పెట్టాలనుకోవడం మోహన్ బాబు చేసిన తప్పా..?
-… pic.twitter.com/VZiyrGqa8S