కాజల్‌తో ముద్దు సీన్‌పై స్పందించిన చోటా.!

మరిన్ని వార్తలు

ఇటీవల జరిగిన 'కవచం' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా స్టేజ్‌పై కాజల్‌ మాట్లాడుతుండగా చోటా.కె.నాయుడు ఆమెని ముద్దాడిన ఇష్యూ సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చయిన సంగతి తెలిసిందే. ఈ రచ్చ ఆగకపోయేసరికి చోటా స్పందించాల్సి వచ్చింది. 

కాజల్‌తో పని చేయడం నా అదృష్టం. గతంలోనూ మేమిద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. కాజల్‌ తనను ఓ కుటుంబ సభ్యుడిలానే భావిస్తుంది. ఆ చనువుతోనే ఆమెను ముద్దాడాను తప్ప, నేనేమీ అసభ్యంగా ప్రవర్తించలేదు.. అంటూ చోటా.కె.నాయుడు తాను చేసిన తొందరపాటు పనిని సమర్ధించుకున్నారు. అయినా ఈ సమర్ధింపు ఆయనకు సబబుగా ఉండొచ్చేమో కానీ, ఓపెన్‌ స్టేజ్‌పై చోటా.కె.నాయుడు చేసిన ఈ తీరు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. 

ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన చేసిన ఈ చర్యతో ఇంతవరకూ సంపాదించుకున్న ఆయన ఉన్నత స్థాయిని దిగజార్చుకున్నట్లయ్యింది. ఏకంగా సినీ పరిశ్రమ నుండి ఆయన్ని బహిష్కరించాలంటూ కొందరు ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు చిన్న విషయాన్ని పెద్దది చేసి చూస్తున్నారనీ చోటాకి మద్దతు పలుకుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS