సూపర్‌స్టార్‌తో సిమ్రాన్‌: వయసు తగ్గిపోయిందోచ్‌.!

By iQlikMovies - November 14, 2018 - 16:52 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌కి జోడీగా ఇద్దరు భామలు నటిస్తున్నారు. వారిలో ఒకరు సీనియర్‌ నటి సిమ్రాన్‌ నటిస్తోంది. 

ఒకప్పుడు తమిళ, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన సిమ్రాన్‌, రజనీకాంత్‌తో కలసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. ఆ కోరిక ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు నెరవేరింది సిమ్రాన్‌కి. దాంతో పట్టరాని సంతోషం ఫీలవుతోందట సిమ్రాన్‌. తన సంతోషాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్‌ - సిమ్రాన్‌ జంటగా ఉన్న లుక్‌ బయటికి వచ్చింది. 

చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు ఈ లుక్‌లో వీరిద్దరూ. చేతిలో పూల కుండీలతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. 'పేట్ట' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నారనీ సమాచారమ్‌. అందులో ఒకటి మిలిటరీ ఆఫీసర్‌ పాత్రట. ఈ క్యారెక్టర్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందట. మరో క్యారెక్టర్‌ కాలేజ్‌ వార్డెన్‌ అనీ తెలుస్తోంది. లేటెస్టుగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

సంక్రాంతికి 'పేట్ట' ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటిస్తూ చిత్ర యూనిట్‌ ఈ పోస్టర్‌ని విడుదల చేసింది. మరోవైపు రజనీకాంత్‌ నటించిన 'రోబో 2.0' చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS