బాహుబలి కారణంగా ఇండియా వైడ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ కి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చిపడింది.
అదేంటంటే, ఆయన చేయబోయే సినిమా సాహూ కి విపరీతమైన హైప్ వచ్చింది. దీనికనుగుణంగా దర్శకుడు సుజిత్ ఈ చిత్ర కథను మారుస్తున్నాడు. అందులో భాగంగానే ఈ చిత్రంలో మరొక విలన్ పాత్ర వచ్చి పడింది.
ఇక ఆ విలన్ పాత్రకి బాలీవుడ్ విలన్ చంకి పాండే ని తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే సాహూలో నీల్ నితిన్ ముకేష్ ని ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.
దీన్నిబట్టి చూస్తే, సినిమా మార్కెట్ ని పెంచే ప్రయత్నంలో భాగంగా బాలీవుడ్ నటులను తీసుకుంటున్నట్టు అర్ధమవుతుంది.