సాహో లో స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్ చేసిన చుంకి పాండే.

By iQlikMovies - August 07, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముక్షేష్, అరుణ్ విజయ్ లుక్స్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు చుంకీ పాండే లుక్ ని విడుదల చేశారు. బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ సినిమా చూసిన వాళ్లకు చుంకీ పాండే ని మర్చిపోరు. పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్రెస్టీజియస్ సాహో సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కామెడీ క్యారెక్టర్ చేయడంలో చుంకీ పాండే అందే వేసిన చేయి.

 

అలాంటిది... ఇప్పుడు యాక్షన్ చేయబోతున్నాడు. విభిన్నమైన పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. స్టైలిష్ యాక్షన్ రోల్ చేయబోతున్నాడు. ఈ క్యారెక్టర్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. "Rise from the Ashes." అనే పవర్ ఫుల్ క్యాప్షన్ తో కూడిన ఈ పోస్టర్ ని చూస్తేనే అర్థమౌతోంది... చుంకీ పాండే ఎంతటి సీరియస్ పాత్ర పోషిస్తున్నాడో.. భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే చుంకీ పాండే పాత్ర సినిమాలో చాలా కీలకం. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకం పై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీ తో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

 

బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS