ఛాయాగ్రహుకుడు ప్రియన్ (53) ఇక లేరు.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈరోజు చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తమిళ దర్శకుడు హరితో 13 చిత్రాలు కలిసి పనిచేసిన రికార్డు ఈయన సొంతం అలాగే సూర్య సింగం సిరీస్ మొత్తానికి ఈయన ఛాయాగ్రహకుడిగా పనిచేయడం విశేషం.
ఈయన ఆకస్మిక మృతితో యావత్ తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇక ఆయన ప్రస్తుతం దర్శకుడు హరితో కలిసి తమ కలయికలో 14వ చిత్రం అయిన సామి స్క్వేర్ చిత్రానికి ఆయన పనిచేస్తున్నారు.
ప్రియన్ ఆకస్మిక మృతికి మా www.iQlikmovies.com తరపున ప్రగాడ సంతాపం తెలియచేస్తున్నాము.