బాలయ్యలా మారిపోతున్న మహేష్‌.?

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలయ్య అంటే తొడ కొట్టి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆయన ఎక్కడికెళ్లినా, తొడ కొట్టడం అనేది మ్యానరిజంలా పెట్టుకున్నారు. అయితే మహేష్‌కీ, బాలయ్యకీ పోలికేంటా అనుకుంటున్నారా.? ఇప్పుడు మహేష్‌ కూడా ఎక్కడికెళ్లినా కాలర్‌ ఎగరేస్తున్నారు.

 

మొన్న 'మహర్షి' సక్సెస్‌ మీట్‌లో మహేష్‌ కాలర్‌ ఎగరేయడం చూశాం. అదో సంచలనమైంది. మళ్లీ ఇప్పుడు హైద్రాబాద్‌లోని సుదర్శన్‌ ధియేటర్‌ వద్ద 'మహర్షి' ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్‌ మరోసారి కాలర్‌ ఎగరేశారు. చూస్తుంటే మహేష్‌కి కూడా ఇదో మ్యానరిజం అయ్యేలా ఉంది. ఇంతకు ముందెన్నడూ మహేష్‌ ఇలా బిహేవ్‌ చేయలేదు. కానీ ఎందుకో 'మహర్షి' విషయంలోనే ఇంత ఓపెన్‌ అయిపోతున్నారు మహేష్‌బాబు. అయితే, ఇలాంటివి ఒక్కసారికే బావుంటాయి. అభిమానులు కోరితే మాత్రం స్టార్‌ హీరోలు అందులోనూ, మహేష్‌ వంటి డిగ్నిఫైడ్‌ హీరోలు కాస్త కంట్రోల్‌లో ఉండాలి. ఇదిలా ఉంటే, త్వరలో విజయవాడలో మరో సక్సెస్‌ మీట్‌ నిర్వహించనుంది 'మహర్షి' టీమ్‌. అక్కడ కూడా మహేష్‌ ఇలాగే కాలరెగరేస్తాడా.? తిరుపతిలోనూ ఓ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అక్కడ కూడా అదే చేస్తాడా.? ఏమో అలా చేస్తే మాత్రం మహేష్‌ బోర్‌ కొట్టించేస్తాడు. చూడాలి మరి సూపర్‌స్టార్‌ ఏం చేస్తాడో. ఇక 'మహర్షి' విషయానికి వస్తే, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాకి ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఉంటున్నాయి ఆ ప్రమోషన్స్‌.

 

నిజమే స్లో టాక్‌తో స్టార్ట్‌ అయిన 'మహర్షి' సక్సెస్‌కి ఈ ఓవర్‌ డోస్‌ ప్రమోషన్సే మోర్‌ సక్సెస్‌నిచ్చాయేమో. ఇప్పటికే 100 కోట్లు గ్రాస్‌ దాటేశాడు 'మహర్షి'. మహేష్‌ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ వసూళ్లు ఫస్ట్‌ వీక్‌లో 'మహర్షి' క్రాస్‌ చేసిందనీ నిర్మాతలు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS