స్పెషల్‌ అప్‌డేట్‌: 'కేజీఎఫ్‌ 2' కోసం 'బాహుబలి' ఏం చేస్తాడంటే!

By iQlikMovies - May 17, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

 కన్నడ సినిమా 'కేజీఎఫ్‌' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో చిన్నదిగా భావించే కన్నడ పరిశ్రమ నుండి ఇంతవరకూ ఏ సినిమా ఈ స్థాయిలో విజయం అందుకున్నది లేదు. అందుకే ఒక్కసారిగా 'కేజీఎఫ్‌' రికార్డులు చూసి అంతా ఉలిక్కి పడ్డారు. ఆ ఊపు ఏమాత్రం చల్లారనివ్వకుండా, అదే సినిమాకి సీక్వెల్‌ని సిద్ధం చేస్తున్నారు. అదే 'కేజీఎఫ్‌ 2'.

 

కేజీఎఫ్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాకి కొంచెం ఎక్కువే బడ్జెట్‌ పెడుతున్నారు. ఇతర భాషా నటీనటులు కూడా ఈ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఆల్రెడీ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికయ్యాడు. ఇక టాలీవుడ్‌ నుండి బాహుబలిగా యూనివర్సల్‌ స్టార్‌డమ్‌ పొందిన ప్రబాస్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.

 

అయితే ప్రబాస్‌ ఈ సినిమాలో నటించడం లేదట. కానీ, తన వాయిస్‌ ఇస్తున్నాడనీ తాజా సమాచారమ్‌. కథని నెరేట్‌ చేసే వాయిస్‌ కోసం ఈ సినిమా హీరో యష్‌ ప్రబాస్‌ వాయిస్‌ అడిగాడట. అందుకు ప్రబాస్‌ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు భాషల్లోనూ ప్రబాస్‌ వాయిస్‌ ఓవరే ఉండబోతోందనీ తెలుస్తోంది. ఏది ఏమైతేనేం, కంటెంట్‌ ఉంటే కటౌట్‌తో పని లేదు అన్నట్లుగా, ప్రబాస్‌ కనిపించకపోతేనేమి.. వినిపించినా ఫ్యాన్స్‌కి ఓకే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS