ప్రముఖ ఛానల్ లో ఒక హిట్ కామెడీ షోలో నటించే ఒక కమెడియన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే, నాగరాజు అలియాస్ నరేందర్ కమెడియన్ గా పేరు తెచ్చుకోవడంతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అయితే తరువాత కాలంలో అవకాశాలు తగ్గడంతో డబ్బు కోసం దొంగతనాలు చేయడానికి అలవాటుపడ్డాడు.
అలా కొద్దిరోజులుగా హైదరాబద్ లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకి పాల్పడ్డాడు. అతని బైక్ పైన తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్ళ పైన నిఘా పెడుతూ దొంగతనాలకి పాల్పడుతున్నాడు. పోలీసులు ఇతని పైన సమాచారం అందుకున్నాక, నాగరాజు కదలికల పైన నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది.
అదుపులోకి తీసుకున్నాక విచారణ చేస్తే ఆయన వద్ద సుమారు రూ 22లక్షల విలువ గల బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ అరెస్ట్ విషయం ఇప్పుడు ఫిలిం నగర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.