గతేడాది డిసెంబరులో పుష్ప 1 విడుదలైంది. 2022 డిసెంబరు 17కి పుష్ప 2ని కూడా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే.. ఈ సినిమా ఈ డిసెంబరులో వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. సంక్రాంతి తరవాత షూటింగ్ మొదలెడతామని ముందే చెప్పినా ఇప్పటి వరకూ అప్ డేట్ ఇవ్వలేదు. మార్చి అయిపోవచ్చింది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.
సుకుమార్ సినిమా అంటే కనీసం యేడాది పాటు సెట్స్‌పై ఉండాల్సిందే. అంటే... 2023 జూన్ వరకూ ఈ సినిమా ప్రొడక్షన్‌లోనే ఉంటుంది. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్. అంటే.. 2023 డిసెంబరుకి గానీ ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవు. ఎంత ఫాస్ట్ గా చేసినా... 2023 ఆగస్టుకి రెడీ అవుతుంది. పుష్ప 2 కోసమే బన్నీ ఏ సినిమా ఒప్పుకోలేదు. బోయపాటి శ్రీను స్క్రిప్టుతో రెడీగా ఉన్నా, బన్నీ నో చెప్పాడు. ఇప్పుడు జూన్‌లో గానీ సినిమా మొదలవ్వదు. అందుకే బన్నీ కాస్త అసహనంగా ఉన్నాడని టాక్.