చలపతిరావు చేసిన కామెంట్ కి ఫిలిం ఇండస్ట్రీ నుండే కాక బయట సామాన్య జనం నుండి నిరసన వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం యూనిట్ మొత్తం ఆ కామెంట్ ని ఖండించగా, చలపతి రావు కూడా తన కామెంట్ కి క్షమాపణ చెబుతూ ఒక వీడియో బైట్ విడుదల చేశాడు.
ఇవన్నీ అటుంచితే, కొద్దిసేపటి ముందు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొండవీటి సత్యవతి, దేవీ అనే ఇద్దరు మహిళలు చలపతిరావు చేసిన కామెంట్ ని ఉద్దేశించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాధుని పోలీసులు స్వీకరించినట్టుగా కూడా తెలుస్తుంది.