రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ వేడుకలో చలపతిరావు అమ్మాయిల పై చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే!
అయితే కొద్దిసేపటి క్రితం, చలపతిరావు తన పై వస్తున్న విమర్శల పై స్పందిస్తూ - నా మాటలని ద్వంద అర్థంతో చూస్తున్నారని! అలాగే తనకి ఆడవారంటే విపరీతమైన గౌరవం ఉందని చెబుతూ, తన మాట ఎవరినైనా నొప్పించి ఉంటే తనని క్షమించమని ఆ వీడియో బైట్ ద్వారా తెలియచేశాడు.
ఇక ఈ విషయం పై కింగ్ నాగార్జున ఇప్పటికే స్పందిస్తూ- చలపతిరావు చేసిన కామెంట్ ని ఖండిస్తున్నాని అలాగే అందరూ ఇలాంటి వ్యాఖ్యలని ఖండించాలని విజ్ఞప్తి చేశాడు.