చలపతిరావు కామెంట్ పై రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి సంబందించిన ఒక్కరోక్కరుగా స్పందిస్తున్నారు. ఇంతక్రితమే, నిర్మాత నాగార్జున ఆ కామెంట్ ని ఖండిస్తూ తన ట్విట్టర్ ద్వారా స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు ఆ చిత్రానికి సంబందించిన హీరో-హీరొయిన్ ల వంతు వచ్చింది. రకుల్ తన ట్విట్టర్ ద్వారా చలపతి రావు ఆ మాట అన్నప్పుడు తనకి తెలుగు భాష పైన పట్టు లేకపోవడం వల్ల వెంటనే ఖండించలేకపోయాను అని చెప్పింది.
అలాగే చైతు కూడా ఆ కామెంట్ వచ్చిన సమయంలో తన రెస్పాన్స్ తప్పుగా చూపించారని, అమ్మాయిల పై కామెంట్ చేస్తే, తాను ఎంజాయ్ చేసే టైపు కాదని స్పష్టంచేశాడు.
మొత్తానికి చలపతిరావు కామెంట్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా యూనిట్ ని వివరణ ఇచ్చుకునే పరిస్థితులోకి నెట్టింది.