ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశాలు దాటి మన ఇండియానీ, మెల్లగా హైద్రాబాద్‌నీ తాకిన సంగతి తెలిసిందే. తాకిడి అంతగా లేకపోయినా, మన తెంగాణా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కరోనాపై ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ఆ క్రమంలోనే, ప్రజల్లో ఈ వైరస్ పట్ల మరింత అవగాహన పెంచేలా రాష్ట్ర హోం మరియు ఆరోగ్య శాఖ మరో అడుగు ముందుకేసింది. రౌడీ విజయ్ దేవరకొండతో ఓ వీడియో షూట్ చేయించి ప్రజల్లోకి వదిలింది.
కరోనాపై భయం వద్దనీ, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి.. శారీరక పరిశుభ్రతను ఎలా పాఠించాలి.. అనే అంశాలపై అవగాహన కల్పిస్తూ విజయ్ దేవరకొండ చేసిన ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. షేక్ హ్యాండ్‌కి బదులు నమస్కారం చేయాలలనీ, ఎక్కువ సార్లు చేతుల్ని శుభ్రపరుచుకోవాలనీ, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే 104కు సమాచారం అందించాలనీ, విదేశాలకు వెళ్లి వచ్చినవారు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలనీ ఈ వీడియోలో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
Public Safety Announcement
— Vijay Deverakonda (@TheDeverakonda) March 10, 2020
Fighting #CoronaVirus.
We have to do this together.
Wishing good health to all of you!
Love,
Vijay. pic.twitter.com/fbafmmtq8S