అదేంటో విచిత్రంగా... భీష్మ - సింగిల్ ఎవర్... సినిమా చేస్తున్నప్పుడే నితిన్ మనసు పెళ్లిపై మళ్లింది. తన స్నేహితురాలు షాలినిని ప్రేమించి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఏప్రిల్ 16న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ పెళ్లి హంగామా నిలిచిపోయిందని టాక్.
కరోనా వైరస్ కారణంతో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని రద్దు చేసుకున్నాడు నితిన్. హైదరాబాద్‌లోనే పెళ్లి చేయాలని ఇరు కుటుంబ వర్గాలూ డిసైడ్ అయ్యాయి. అయితే కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండడంతో ఈ పెళ్లిని కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ తరవాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఏప్రిల్ 14 తరవాత ఏం జరుగుతుందో చూసి, అప్పుడు దాని ప్రకారం కొత్త పెళ్లి డేటు ఫిక్స్ చేయాలని నితిన్ భావిస్తున్నాడట. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి దాదాపుగా లేనట్టే.