సింగర్స్‌ని టార్గెట్‌ చేసిన కరోనా.!

మరిన్ని వార్తలు

ఇప్పటికే ప్రముఖ అమెరికా కంట్రీ సింగర్‌ అయిన జోయ్‌ డిఫ్పీ కరోనాతో మరణించారు. ఏజ్డ్‌ పర్సన్‌ కావడం, హెల్త్‌ ఇష్యూస్‌ ఎక్కువగా ఉండడంతో, ఈయనపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. ప్రాణాలను హరించింది. ఆయన చనిపోతూ, కరోనాని తేలిగ్గా తీసుకోవద్దని చాలా జాగ్రత్తగా ఉండాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు సూచించారు. మరోవైపు ఇంకో అమెరికన్‌ సింగర్‌ జాన్‌ ప్రైన్‌ కూడా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. ఆయనతో పాటు, ఆయన భార్యకీ కరోనా సోకడంతో ఇద్దరూ ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈయనకీ ఇతర హెల్త్‌ ఇష్యూస్‌ ఎక్కువగానే ఉండడంతో కరోనా నుండి కోలుకోవడం కష్టమే అని వైద్య బృందాలు తెలుపుతున్నాయి.

 

ఇదిలా ఉంటే, మరో అమెరికన్‌ యంగ్‌ సింగర్‌, పైన చెప్పుకున్న వారిలానే గ్రామీ అవార్డ్‌ విజేత అయిన కేలీ షోర్‌కీ కరోనా పాజిటివ్‌ తేలింది. గత మూడు వారాలుగా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నా, ఈమెనీ కరోనా వదిలిపెట్టలేదు. కరోనా కారణంగా ఆమెకు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, జ్వరం, ముక్కు పనిచేయకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయట. దాంతో, కరోనాతో ఆటలొద్దు, ఇది అంత ఆషా మాషీ వైరస్‌ కాదనీ, అస్సలు తేలిగ్గా తీసుకోవద్దంటూ తన ఫ్యాన్స్‌కి సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్ధిస్తోంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌ సింగర్‌ కరికా కపూర్‌ సంగతి తెలిసిందే. ఆమెకు ఇప్పటికే ఐదు సార్లు కరోనా టెస్ట్‌లు చేశారు. ఐదు సార్లూ పోజిటివ్‌ అనే వస్తోంది. చికిత్స తీసుకుంటున్నా, కరికా కరోనా నుండి కోలుకోవడం లేదు. జీవితం ఎవర్నీ వదిలి పెట్టదు. అందరి టెంపర్‌ తీర్చేస్తుంది.. అని ఓ హీరో చెప్పిన డైలాగ్‌లా కరోనాతో పెట్టుకుంటే అంతే మరి. సో జర జాగ్రత్త సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS