జగపతిబాబు - సౌందర్య... వీరిద్దరి గురించి టాలీవుడ్ జనాలు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. జగపతి బాబు టాపిక్ ఎప్పుడొచ్చినా - అక్కడ సౌందర్య ప్రస్తావన తప్పనిసరి. ఎందుకంటే వారిద్దరి పై పుట్టిన గాసిప్పులు అలాంటివి. జగపతిబాబు కూడా ఎప్పుడూ ఏదీ దాచుకోలేదు. తన మనసులోని మాటని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే వచ్చాడు.
ఇప్పుడు సౌందర్యతో తన అనుబంధం గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు. ``సౌందర్యతో నాకు ఎఫైర్ ఉంది. కానీ అది అందరూ అనుకుంటున్న ఎఫైర్ కాదు. తన సోదరుడితో నాకు మంచి అనుబంధం ఉంది. సౌందర్యతో కూడా. నేను తరచూ వాళ్లింటికి కూడా వెళ్లేవాడిని. దాంతో.. మా ఇద్దరి మధ్య ఏదేదో ఉందని అనుకునేవారు. నిజానికి మా అనుబంధం చాలా గట్టింది. ఆ బంధం గురించి మీకెవ్వరికీ అర్థం కాదు. ఎఫైర్ అంటే అందరూ శారీరక సంబంధమే అనుకుంటారు. కానీ మా అనుబంధం అంతకంటే గొప్పది`` అని చెప్పుకొచ్చాడు జగపతిబాబు. ఇంతకు మించి ఎవరైనా ఏం చెప్పగలరు? ఎంతని చెప్పగలరు..? ఓ కథానాయికతో ఓ కథానాయకుడికి ఉన్న అనుబంధాన్ని ఇంతకంటే సూటిగా, స్పష్టంగా ఎవ్వరూ ఆవిష్కరించలేరు. ఈ విషయంలో జగ్గూభాయ్ గ్రేటే.