షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంతోషం... చప్పున చల్లారిపోయింది. కరోనా వల్ల. షూటింగులతు ఇలా మొదలయ్యాయో లేదో, అలా... కరోనా నటీనటులపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా బుల్లి తెర తారలు కరోనా భయాలతో గజగజలాడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రభాకర్ అనే నటుడికి కరోనా వచ్చినట్టు తేలడంతో టీవీ పరిశ్రమ షాక్ కి గురైంది. ఇప్పుడు నవ్యా స్వామి అనే మరో నటికి కూడా కరోనా పాజిటీవ్ అని నిర్దారణ అయ్యింది. మా టీవీ, ఈటీవీ ధారా వాహికలతో నవ్య మంచి పేరు తెచ్చుకుంది. `ఆమె కథ`, `నా పేరు మీనాక్షి`నవ్యకి మంచి పేరు తీసుకొచ్చాయి.
`నా పేరు మీనాక్షి` సీరియల్ షూటింగ్ సమయంలో రాండమ్ గా నవ్యకి పరీక్షలు నిర్వహిస్తే.. కరోనా పాజిటీవ్ అని తేలింది. గత వారం రోజులుగా ఆమె వరుసగా షూటింగులు చేస్తోంది. దాంతో.. ఆమెతో పాటు నటించిన వాళ్లందరికీ ఇప్పుడు కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఇలా రోజుకొకరు కరోనా బారీన పడుతుండడంతో టీవీ రంగానికి ఏం పాలుపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగులు చేయాలా? లేదంటే ఇంట్లో కూర్చోవాలా? అనే విషయం పాలుపోక.. సందిగ్థానికి గురవుతోంది టీవీ పరిశ్రమ.