సినీ ఇండస్ట్రీ ని తాకిన 'కరోనా' ఎఫెక్ట్!

By iQlikMovies - February 06, 2020 - 18:18 PM IST

మరిన్ని వార్తలు

ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న 'కరోనా వైరస్' సెగ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3000కు పైగా చేరింది, వేల మంది చికిత్స కొరకు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 'చైనా' కు సందర్శకులను కూడా పూర్తిగా ఆపేసింది అక్కడి ప్రభుత్వం. చైనా లో సినిమా ప్రదర్శనలు కూడా పూర్తిగా నిలిపివేయడంతో పరిశ్రమకు భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కరోనా సెగ మన సినీ ఇండస్ట్రీ కు కూడా తాకింది. బాలీవుడ్ లో చాలా చిత్రాలు విదేశీ షెడ్యూల్స్ క్యాన్సల్ చేసుకున్నాయి.

 

అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' కూడా ఒక విదేశీ షెడ్యూల్ క్యాన్సల్ చేసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లు కొన్ని 'థాయిలాండ్' లో చిత్రీకరించాల్సి ఉంది.. కానీ కరోనా పుణ్యమా అంటూ ఆ షెడ్యూల్ పూర్తిగా క్యాన్సల్ చేసేశారట. నాగార్జున ఈ చిత్రం లో 'రా' ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఇదే కాకుండా పలు చిత్రాలు, ఫారెన్ షూటింగులు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ కరోనా వైరస్ బెడద ఎప్పుడు వీడుతుందో చూడాలి మరి.

prabhas at airport with mask for coronavirus protection

 

prabhas

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS