‘అర్జున్‌రెడ్డి’తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ తాజాగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వస్తున్నాడు. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో కాస్సేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్లో చాలా ఎమోషన్స్ చూపించాడు విజయ్ దేవరకొండ. చాలా క్యాజువల్‌గా విజయ్ దేవరకొండ చెప్పే ప్రతీ డైలాగ్ మళ్లీ యూత్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి. నలుగురు ముద్దుగుమ్మలతో డిఫరెంట్ వేరియేషన్స్‌లో చూపిస్తున్న లవ్ సన్నివేశాలు యూత్‌లో మళ్లీ కాక రేపేలా ఉన్నాయి. హ్యాండ్సవ్ు లుక్స్‌తో పాటు, రగ్గ్డ్ లుక్స్‌లోనూ కనిపిస్తున్నాడు విజయ్ ఈ సినిమాలో.
ప్రేమ బంధంతో పాటు, పెళ్లి బంధాన్నీ ఈ సినిమాలో మిళితం చేయడం విశేషం. విజయ్ మార్క్ శృతి మించిన రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలోనూ పుష్కలంగా ఉన్నాయి. అంతకు మించి ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్లజెంట్‌గా స్టార్ట్ అయిన ట్రైలర్, ‘నా గుండెకు తగిలిన గాయం మానాలంలే, ఫిజికల్‌గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి..’ అంటూ ఎమోషనల్ డైలాగ్‌తో ఎండ్ చేశారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరీన్, ఇసాబెల్లె హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నారు.