కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో, ధియేటర్స్ బంద్, షూటింగ్స్ బంద్.. మాల్స్ బంద్. అందరూ ఇంట్లోనే బంధీ అయిపోయారు. అయితే, ఏముందిలే.. ఇంట్లోనే ఉన్నా, చక్కగా టీవీ చూస్తూ కాలక్షేపం చేసేయొచ్చులే అనుకున్న వారికి చుక్కెదురైంది. టీవీ కూడా మోసం చేసింది. రెండు, మూడు రోజులు బాగానే ఉన్నా, తర్వాతి నుండి బోర్ మొదలైంది. అందుకు కారణం, టీవీలో కొత్త ప్రోగ్రామ్స్ కాదు కదా.. డైలీ ప్రోగ్రామ్స్‌కే గండి పడింది.
పాపం లేడీస్.. సీరియల్స్ రాక చిర్రెత్తిపోతున్నారు. పూర్తయిన షూటింగ్స్ వరకూ టెలీ కాస్ట్ చేశారు. ఇక తర్వాత ఏం చేస్తారు.? షూటింగ్స్ బంద్ కదా.. దాంతో ఓల్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ, కొన్ని సార్లు వేసిందే వేసుకుంటూ విసుగు తెప్పిస్తున్నారు. దాంతో టీవీ చూడాలంటేనే విసుగు పుట్టేస్తోంది జనానికి. అయినా తప్పదు, ఆ పాత ప్రోగ్రామ్స్‌నే మళ్లీ మళ్లీ చూస్తూ ఉన్నంతలో ఎంజాయ్ చేస్తున్నారనుకోండి. స్పాన్సర్స్ లేక సినిమాలు కూడా ప్రసారం చేయలేని దుస్థితి పాపం బుల్లితెర నిర్వాహకులది. ఎవరి కష్టం వారిది. ఏం చేస్తాం. కరోనా తెచ్చిపెట్టిన ఊహించని కష్టమిది. భరించాల్సిందే.