ఈ ఏడాది సంక్రాంతికి ధియేటర్స్‌లో సందడి చేసిన ‘సరిలేరు నీకెవ్వరూ..’ మంచి విజయాన్ని అందుకుంది. లేటెస్ట్‌గా ఈ ఉగాదికి బుల్లితెరపై ఈ సినిమాని ప్రసారం చేశారు. ఇక్కడా మంచి టీఆర్‌పీ రేటింగ్స్‌ని దక్కించుకుంది ఈ సినిమా. ఈ రెస్పాన్స్‌కి ఫిదా అయిన సినిమా నిర్మాతలు ఇంకోసారి ‘సరిలేరు..’ను టీవీలో ప్రసారం చేయానుకుంటున్నారట. అయితే, ఈ సారి సరికొత్తగా.. అంటే, మరికొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ యాడ్ చేస్తూ ఈ సినిమాని బుల్లితెరపై వదలబోతున్నారట. ఈ విషయాన్ని ‘సరిలేరు..’ నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇంకేముంది.. అసలే లాక్ డౌన్ వేళ, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ తరుణంలో ‘సరిలేరు..’ బుల్లితెరపై మళ్లీ సెన్సేషన్ సృష్టించడం ఖాయమే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఇంపార్టెంట్ రోల్ పోషించారు. పతాక సన్నివేశాల్లో విజయశాంతి నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. కొన్ని సీన్స్‌లో ఆమె చూపించిన హావ భావాలకు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. అందుకే ఆమెకు సంబంధించిన మరిన్ని ఎక్స్‌ట్రా సీన్స్‌ని తాజా టెలికాస్ట్‌లో యాడ్ చేయనున్నారట. అలాగే హీరోయిన్ రష్మికకు సంబంధించిన కొన్ని కామెడీ సీన్లు కూడా యాడ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సో ‘సరిలేరు..’ మరోసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి రెడీ గురూ.!