ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్‌కి అస్సలు బేధాభిప్రాయాలు లేవు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తోంది. కొన్ని దేశాల్లో హెల్త్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఈ కరోనా హరించేస్తోంది. ఇక తాజాగా ఓ హాలీవుడ్ హీరోనీ, ఆయన ఫ్యామిలీని చుట్టుముట్టింది ఈ కరోనా మహమ్మారి. టామ్ హాంక్స్ అనే హాలీవుడ్ హీరోకి తాజాగా కరోనా ఎఫెక్ట్ అయ్యిందని తెలిసింది. ఆయనతో పాటు, ఆయన ఫ్యామిలీకి కూడా కరోనా పోజిటివ్ అని వచ్చిందట. దాంతో మన హీరోలు కూడా భయపడిపోతున్నారు. ఇప్పటికే కొన్ని షూటింగ్స్ కరోనా కారణంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ నిమిత్తం ఈ మధ్యనే ప్రబాస్ యూరప్ వెళ్లాడు. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండడంతో, ప్రబాస్ అండ్ టీమ్‌లో టెన్షన్ పెరిగిపోతోందట. మరోవైపు సినిమా రిలీజ్‌ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కారణంగా సినిమా ధియేటర్లు కూడా మూసి వేసేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తమ తమ సినిమా రిలీజ్‌ల పరిస్థితి ఏంటా.? అని నిర్మాతలు మల్లగుల్లాలు పట్టుకుంటున్నారట.