ఏ రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు. ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడించేస్తోంది. అనూహ్యంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ఏమీ వర్కవుట్ అయ్యే ప్రశక్తే లేదు. అన్ని రంగాల్లోనూ కరోనా టెర్రర్ ఇలాగే ఉంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయడంలో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఫారెన్ షూటింగ్స్ ఆలోచన చేయడానికైతే భయపడిపోతున్నారు. కేరళ, కర్ణాటక వంటి ప్లేసెస్‌కి వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇప్పుడు లోకల్‌గా అంటే ఏపీ, తెంగాణాలనూ కరోనా తాకేసింది.
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా యూరప్, ఇటలీ లాంటి దేశాల్లో షూటింగ్‌కి వెళ్లడం చాలా సర్వసాధారణమైపోయింది. అలాంటిది, కరోనా టెర్రర్‌తో ఇప్పుడలాంటి చోట్లకు వెళ్లలేకపోతున్నారు ఇప్పటికే యూరప్ షూటింగ్‌లో ఉన్న ప్రబాస్ అండ్ టీమ్ టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడివక్కడే షూటింగ్ పనులు ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చేసే యోచనలో ప్రబాస్ టీమ్ ఉన్నారట. అలాగే విక్రమ్ నటిస్తున్న ‘కోబ్రా’ సినిమా షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కరోనా దెబ్బకి, ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆపేసి వచ్చేశారట. ఇలా నిర్మాణంలో ఉన్న సినిమాలు షూటింగ్ కోసం తంటాలు పడుతుంటే, రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సినిమాల టెన్షన్ మరోలా ఉంది. ధియేటర్స్ బంద్ కారణంగా నిర్మాతల సినిమా కష్టాలు చెప్పుకోవడానికే లేకుండా పోయింది.