అల్లు అర్జున్ ` సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి మరో కొత్త గ్లామర్ యాడ్ అయినట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ రోల్‌లో కనిపించనుందట. అది పోలీస్ గెటప్ అనీ తెలుస్తోంది. దాదాపు ఈ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యిందనీ మాట్లాడుకుంటున్నారు. గతంలో సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించింది రకుల్. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. అలాగే అల్లు అర్జున్‌తో రకుల్ నటించిన ‘సరైనోడు’ కూడా సూపర్ డూపర్ హిట్ సినిమానే. సో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలానే ఉంది.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా క్రేజీ భామ రష్మికా మండన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే అనసూయ కూడా ఓ డిఫరెంట్ రోల్ పోషిస్తుందనే సమాచారం ఉంది. విజయ్ సేతుపతి, జగపతిబాఋ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కి సిద్దమవ్వాల్సిన ఈ సినిమాకు కరోనా కారణంగా తాత్కాలికంగా కొంత బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ చిత్తూరు కుర్రోడిలా కనిపించనున్నాడు. శేషాచలం అడవుల్లో కొంత భాగం, కేరళ అటవీ ప్రాంతంలో మరికొంత భాగం చిత్రీకరణకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేశారు.