సినీ రంగంలో తను సంపాదించిన ఆస్థుల్ని తన తర్వాత తన కూతుళ్లకే చెందాలని శ్రీదేవి కోరుకుంది. బోనీ కపూర్‌తో పెళ్లి అనుకున్నప్పుడే ఈ విషయంలో అతనితో ఒప్పందం కూడా కుదుర్చుకుందట. అయితే బోనీ కపూర్ మాత్రం కొన్ని ఆస్థుల్ని కరగదీసేశాడట. దాంతో ఇప్పుడు శ్రీదేవి ఆస్థులు ఎంత? అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ముంబయ్‌లోని శ్రీదేవి ఇల్లు వంద కోట్లు దాకా పలుకుతుందట. చెన్నైలోనూ, దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లోనూ శ్రీదేవి తన కుమార్తైల కోసం ఆస్థుల్ని సంపాదించిందట. వాటి గురించి ఇప్పుడు పూర్ కుటుంబంలో అలజడి బయలుదేరింది.
ఈ తరుణంలో తమ తరపున మాట్లాడేవారు లేక కపూర్ కుటుంబంలో ఖుషీ, జాన్వీ ఒంటరివారైపోయారు. ఓ పక్క తల్లి హఠాన్మరణం వీరిద్దరినీ శోక సంద్రంలోని నెట్టివేయగా, మరో పక్క కుటుంబంలో ఈ ఆస్థుల కలహాలు..ఈ వయసులో వీరి మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీలకు అండ ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది. తమ కెరీర్‌ని ఎలా మలుపు తిప్పుకోవాలో తెలియని దీన స్థితిలో ఉన్నారు వీరిద్దరూ ఇప్పుడు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ ఇప్పుడిప్పుడే సినీ రంగంలోకి అడుగుపెడుతోంది.
సినీ రంగంలోని ఒడుదుడుకులు, ఒత్తిడులు ఆమెకి అంతగా పరిచయం కావు. కెరీర్ పరంగా తాను ఎంచుకున్న వృత్తి పరిస్థితి ఇలా ఉంటే, కుటుంబంలో తన తల్లి కష్టపడి సంపాదించిన ఆస్థుల విషయంలో తగాదాలు ఈ రకంగా ఉన్నాయి. శ్రీదేవి బతికున్నన్నాళ్లు కూతుళ్లకు మంచి భవిష్యత్తుని ఎలా ఇవ్వాలనే ఆలోచనతోనే తీవ్రంగా కలత చెందేది. తీరా వారికి ఏ రకమైన భరోసా ఇవ్వకుండానే, ఇలా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది.